విజయవంతంగా ఎస్సీ కులాల సంచార తెగల ఆత్మీయ సమ్మేళనం

విజయవంతంగా ఎస్సీ కులాల సంచార తెగల ఆత్మీయ సమ్మేళనం

మనమంతా హిందువులం… మనమంతా సోదరులం

కరీంనగర్ ఆగస్ట్ 22 ప్రశ్న ఆయుధం

సామాజిక సమరసత వేదిక జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున కరీంనగర్ పట్టణంలోని వైశ్య భవనంలో ఎస్సీ కులాల, సంచార తెగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు సమ్మేళనంలో మనమంతా హిందువులం మనమంతా సోదరులం అనే నినాదంతో ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారు కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక అఖిలభారత సమరసత కన్వీనర్ శ్యాం ప్రసాద్ సామాజిక సమసరసత వేదిక అఖిలభారత కళా ప్రముఖ అప్పాల ప్రసాద్ లు హాజరై మాట్లాడుతూ ఎస్సి లోని 59 కులాల వాళ్ళు ఏదో ఒక సందర్భంలో కలుస్తూ ఉండటం వల్ల, సమరసతా భావం వెల్లి విరుస్తుందన్నారు. ,ఎస్ సి లు,ఇతర కులాల వారి మధ్య అంతరాలు తొలగిపోవాలని ఆశించినట్లుగానే,ఎస్ సి కులాల మధ్య అసమానతలు తొలగించేందుకు కృషి చేయాలన్నారు. కులం పేరుతో పరిహాసాలు ఆడొద్దని,ఎక్కువ తక్కువ భేదాలు చూపొద్దని,ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా ఉపయోగించే పదాల విషయంలో జాగ్రత్తలు చెప్పాలని,కష్ట సుఖాల్లో భాగస్వాములు కావాలని కోరారు బెడ ,బుడగ జంగం,మాల జంగం,మోచి,వాల్మీకీ,మాదిగ,మాల,గోసంగి,నేతకాని, మిథుల అయ్యవార్లు, చిందు,పెద్దమ్మల వాళ్ళు,మాష్టి మొదలైన కుల పెద్దలకు సన్మానం చేశారు. ఇట్టి ప్రోగ్రాంలో సమరసతా వేదిక రాష్ట్ర కార్యదర్శి పి రామారావు,

ఎస్ సి రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు దావు సంతోష్, జిల్లా అధ్యక్షులు తుమ్మల రమేష్ రెడ్డి, ఎస్ సి పరిరక్షణ సమితి కార్యదర్శి కల్లేపల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment