గ్రామపంచాయతీలలో పనుల జాతరను ప్రారంభించిన మండల ప్రత్యేక అధికారి కమలాకర్ రెడ్డి
జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్టు 22 ప్రశ్న ఆయుధం
శుక్రవారం రోజున మండల ప్రత్యేక అధికారి పి కమలాకర్ రెడ్డి గ్రామపంచాయతీలలో పనుల జాతరను ప్రారంభించారు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని 18 గ్రామపంచాయతీలో 2025 పనుల జాతరను మండల ప్రత్యేక అధికారి కమలాకర్ రెడ్డి ఎంపీడీవో రాజేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు మండలానికి వచ్చిన ఉపాధి హామీ నిధులను 1.16 లక్షలతో 8 గ్రామాలలో వివిధ నూతన పనులకు భూమి పూజ నిర్వహించారు మండలంలో 10 గ్రామపంచాయతీల్లో సుమారు 7.22 లక్షల పూర్తయిన పనులను ప్రారంభోత్సవం నిర్వహించారు అన్ని గ్రామాలలో వికలాంగులైన ఉపాధి హామీ కూలీలను గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి పి కమలాకర్ రెడ్డి , ఎంపీడీవో రాజేశ్వరరావు ఏపీవో రవికుమార్ , పంచాయతీ కార్యదర్శులు, టి ఏ లు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు