ప్రతి ఒక్కరూ సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు విధిగా చేసుకోవాలి            డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు

ప్రతి ఒక్కరూ సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు విధిగా చేసుకోవాలి

డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు

జమ్మికుంట ఆగస్టు 22 ప్రశ్న ఆయుధం

ప్రతి ఒక్కరూ సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు విధిగా చేసుకోవాలని హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు తెలిపారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఎంప్లాయిస్ కాలనీ కృష్ణ కాలనీ కూడలి వద్ద శుక్రవారం రోజున జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపు (సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు) నిర్వహించారు ఈ క్యాంప్ లో ఐసిటిసి విభాగం పాల్గొని హెచ్ఐవి,హెపటైటిస్ బి వంటి పరీక్షలు చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు అలాగే ఆరోగ్య శాఖ సిబ్బంది బిపి, షుగర్, టి.బి మలేరియా,డెంగ్యూ పరీక్షలు చేసి మందులు అందజేశారు ఈ శిబిరాన్ని హుజురాబాద్ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు సందర్శించారు అనంతరం డాక్టర్ చందు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు హెచ్ఐవి, హెపటైటిస్ బి,టి బి, షుగర్ పరీక్షలు విధిగా ప్రతి ఒక్కరూ చేసుకోవాలని,సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బీపీ,షుగర్ మందులు ప్రభుత్వం అందించే మందులనే వాడాలని తద్వారా ఆర్థికంగా భారం తగ్గించుకోవచ్చు అని మలేరియా,డెంగ్యూ,చికెన్ గునియా మొదలగు వ్యాధులు వ్యాపించు విధానం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి,వ్యక్తిగత పరిశుభ్రత,పరిసరాల పరిశుభ్రత, డ్రైడే ప్రత్యేకత గురించి వివరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చందన, డాక్టర్ ఫర్హానుద్దీన్,మోహన్ రెడ్డి హెల్త్ హెడ్యుకేటర్, సూపర్వైజర్స్ రత్నకుమారి,దేవేందర్ రెడ్డి ఐ సి టి సి కౌన్సిలర్ మహిపాల్,ల్యాబ్ టెక్నీషియన్స్ రామకృష్ణ, ఇబ్రహీం,హెల్త్ అసిస్టెంట్ నరేందర్,ఏఎన్ఎం రాధా ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment