జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (టీజేఏ) 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
- హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా టీజేఏ వేడుకలు..
- సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకం.
- బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి.
ప్రశ్న ఆయుధం 23జులై
హైదరాబాద్,
ప్రస్తుత సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకం అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతి మినీ ఆడిటోరియంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (టీజేఏ) 10వ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర టీజేఏ ఫౌండర్ ఉప్పల లక్ష్మణ్ సారథ్యంలో టీజేఏ రాష్ట్ర అధ్యక్షులు రమణ రావు అధ్యక్షతన జరిగింది. ముందుగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రకాష్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్. ఏ ఎస్ రావు కేక్ కట్ చేసి టిజేఏ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభించారు. బిజెపి అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. టీజేఏ ఆవిర్భావ దినోత్సవం సంధర్బంగా శుభకాంక్షలు తెలిపారు. జర్నలిస్ట్ యూనియన్ లు సంఘటితంగా ఉంటే సమస్యలను అధిగమించవచ్చన్నారు. జర్నలిస్టులు పార్టీలకు, కులాలకు మతాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసం పాటు పడాలన్నారు. జర్నలిస్ట్ ల సమస్యలను బీజేపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. అనంతరం టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్. ఎఎస్ రావు మాట్లాడుతూ..జర్నలిస్ట్ ల సంక్షేమానికి టీడీపీ చేయూత నిస్తుందన్నారు. టీజేఏ యూనియన్ 10ఏళ్ల ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. జర్నలిస్ట్ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరి పై బాధ్యత ఎక్కువ ఉంటుందని, ఎన్నో వత్తిళ్ళు ఉంటాయన్నారు. జాతీయ స్థాయిలో ఉన్న ఎన్ యు జె(ఐ)కి టీజేఏ అనుబంధంగా ఉందని, టీజేఏ యూనియన్ అభివృద్ధికి తన వంతు కృషి ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీజేఏ, ఆంధ్రప్రదేశ్ లో జాప్ యూనియన్ అభివృద్ధికి ఫౌండర్ అయిన ఉప్పల లక్ష్మణ్ కృషి అభినందనీయం అన్నారు. అనంతరం ఎన్ యు జె(ఐ) కార్యదర్శి వి.రాజేందర్ నాథ్ మాట్లాడుతూ..జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం టీజేఏ కృషి అభినందనీయం అన్నారు. జర్నలిస్ట్ రైల్వే రాయితీ పాస్ ల కోసం ఎన్ యు జె(ఐ) తన ప్రయత్నం చేస్తుందన్నారు. రైల్వే రాయితీ పాస్, కోసం ఇటీవలే ఏపీ సంబంధిత కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించిన విషయం గుర్తు చేశారు. టీజేఏ ఫౌండర్ ఉప్పల లక్ష్మణ్ మాట్లాడుతూ…జర్నలిస్ట్ లకు రాష్ట్ర ప్రభుత్వం సొసైటీ ల ద్వారా ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, టీజేఏ ద్వారా ఏర్పాటు అయిన మహాత్మ గాంధీ జర్నలిస్ట్ మిచ్వల్లి ఎయిడెడ్ హోసింగ్ కో ఆపేరేటివ్ సొసైటీ కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ఈసారి టీజేఏ కు అన్ని రాష్ట్ర జర్నలిస్ట్ కమిటీల్లో సభ్యత్వం కోసం సమాచార శాఖ మంత్రిని కలిసి వినతి పత్రం ఇవ్వగా, సానుకూల స్పందన లభించిందన్నారు. జర్నలిస్ట్ ల సమస్యల పై టీజేఏ ఎప్పుడు ముందు ఉంటుందన్నారు. టీజేఏ రాష్ట్ర అధ్యక్షులు రమణారావు మాట్లాడుతూ…ఎన్ యు జె(ఐ)కి అనుబంధంగా ఉన్న టీజేఏ రాష్ట్రంలో జర్నలిస్ట్ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పంధిస్తుందన్నారు. త్వరలో టీజేఏ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కొత్త కమిటీలు పూర్తి చేస్తాం అన్నారు. త్వరలో టీజేఏ సభ్యులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తాం అన్నారు. ఎన్ యు జె (ఐ) సభ్యులు దన్నారపు రాజాలింగం, కుమారస్వామి మాట్లాడుతూ..జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం టీజేఏ కృషి అభినందనీయం అన్నారు. టీజేఏ అభివృద్ధికి ఫౌండర్ అయిన ఉప్పల లక్ష్మణ్ కృషి అభినందనీయం అన్నారు. ఈ ఆవిర్భావ దినోత్సవ సభలో ప్రముఖ పాత్రికేయులు వాసుదేవరావు, బకార్ మీర్జా, సరితా, యూనియన్ ప్రతినిధులు అబ్దుల్ సత్తార్, సంపత్ , ఖాసీం, ఖాళీళ్ అహమ్మద్, గౌరీ, రాజు, నసీర్ ఖాద్రి, అరిఫ్, ఆసీఫ్, నాగేశ్వర్ రావు, డేవిడ్ జేమ్స్, కుమారస్వామి, యాదయ్య, సురేష్ తో పాటు దాదాపు 250 మంది రాష్ట్రస్థాయిలో జర్నలిస్టులు, ఉర్దూ జర్నలిస్టులు పాల్గొన్నారు.