బ్లేడ్లు మింగిన ఆటోడ్రైవర్.. ఆపరేషన్ లేకుండా బయటకు తీసిన ‘గాంధీ’ వైద్యులు
కుటుంబ కలహాలతో 8 షేవింగ్ బ్లేడ్లు మింగిన ఆటో డ్రైవర్
గాంధీ ఆసుపత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు
ఆపరేషన్ లేకుండానే చికిత్స చేయాలని వైద్యుల నిర్ణయం
ప్రత్యేక వైద్య ప్రక్రియతో మలం ద్వారా బయటకు వచ్చిన 16 బ్లేడ్ ముక్కలు
మూడు రోజుల చికిత్సతో పూర్తిగా కోలుకున్న బాధితుడు
విజయవంతంగా చికిత్స పూర్తి చేసి డిశ్చార్జ్ చేసిన వైద్యులు
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. కుటుంబ కలహాల కారణంగా క్షణికావేశంలో 8 షేవింగ్ బ్లేడ్లను ముక్కలు చేసి మింగేసిన ఓ వ్యక్తికి ఎలాంటి శస్త్రచికిత్స చేయకుండానే వైద్యులు తొలగించారు. అత్యంత క్లిష్టమైన ఈ కేసులో వైద్యులు తమ నైపుణ్యంతో మూడు రోజుల్లోనే కడుపులోని 16 పదునైన బ్లేడ్ ముక్కలను సురక్షితంగా బయటకు రప్పించారు.
మౌలాలీ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ ఖాజా (37)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 16న కుటుంబంలో జరిగిన గొడవతో ఆవేశానికి లోనైన ఖాజా 8 షేవింగ్ బ్లేడ్లను రెండేసి ముక్కలుగా చేసి మింగేశాడు. కాసేపటికే కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో