డీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వివేకు విన్నపం
ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలకు అన్యాయం జరిగింది
హక్కుల ఉద్యమానికి మద్దతు తెలపండి బొమ్మెర శ్రీనివాస్
ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 23 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీ కులాలకు తీరని అన్యాయం జరిగింది ఉన్నారు.
డి ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వివేక్ కు కొత్తగూడెం వచ్చిన సందర్భంగా శనివారం షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో సగం భూభాగం వెనుకబడ్డ ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడ్డ ఎస్సీ కులాలకు రాజ్యాంగపరమైన హక్కులు,అభివృద్ధి నోచుకోవడం లేదని తెలియజేశారు.గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో స్థానిక ఎస్సీ రిజర్వేషన్ జెడ్పిటిసిలు, ఎంపీటీసీలు కోల్పోయినరని అదేవిధంగా సాగులో ఉన్న భూములకు హక్కులు కోల్పోయినారనివెల్లడించారు.
ఏజెన్సీ ప్రాంతం పేరుతో ఎస్సీ కులాలను అభివృద్ధికి దూరం చేశారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చినారని హామీ నెరవేర్చకపోతే కలిసివచ్చే సంఘాలతో
ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కలిసి రావాలని కోరారు.ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడ రమేష్,సలిగంటి కొమరయ్య, కండె రాములు,ఎనగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.