వినాయక చవితి దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు
ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు
మతసామరస్యంతో పండుగల జరుపుకోవాలి
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు
పట్టణ సీఐ ఎస్ రామకృష్ణ గౌడ్
జమ్మికుంట ఆగస్టు 23 ప్రశ్న ఆయుధం
త్వరలో రానున్న వినాయక చవితి దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పోలీసులు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో సీఐ రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చి నిర్వహించారు శనివారం రోజున జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ప్రధాన రహదారి పైన పురవీధులలో పోలీసులు కవాతు నిర్వహించి అనంతరం సీఐ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ త్వరలో రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో మతసామరస్యంతో నిర్వహించుకోవాలని శాంతి భద్రతలకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మండపాలు నిర్వహించే యాజమాన్యాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు అలాగే స్థానిక ఎలక్షన్ల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలోని ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని రాగద్వేషాలకు పోకుండా సోదర భావంతో మెలగాలని కోరారు ఈ కవాతులో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సాట్ టీం లోకల్ పోలీసులతో శనివారం ఉదయం 11 గంటలకి కవాతు( ఫ్లాగ్ మార్చ్) నిర్వహించారు