మట్టి గణపతుల పంపిణిలో రామకోటి రామరాజు కృషి అమోఘం
21 సంవత్సరాల నుండి పంపిణి రామకోటి సంస్థ ఘనత
మట్టి గణపతులనే వాడాలని కరపత్రాలు ఆవిష్కరణ
నాడు 20 నుండి నేడు 2000 గణపతుల పంపిణి అమోఘం
మెదక్ జిల్లా ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి
ప్రశ్న ఆయుధం ఆగష్టు 24గజ్వెల్
మట్టి గణపతులనే వాడాలని గత 21 సంవత్సరాలనుండి ప్రచారాన్ని నిర్వహించి గణపతులను అందజేస్తున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వారు. ఆదివారం నాడు మట్టి గణపతులకు సంబందించిన కరపత్రాలను ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సి వంటేరు యాదవరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ ప్లాస్టరప్ ప్యారీస్ గణపతుల వల్ల జీవరాసులకు హాని కల్గుతుందన్నారు. సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు గారు గత 21 సంవత్సరాలనుండి మట్టి గణపతులను భక్తులకు అందించడం అన్నది అయన అపారమైన భక్తి అమోఘం అన్నారు. గజ్వేల్ లో ఎవరు పంపిణి చేయని సమయంలోనే రామకోటి రామరాజు పంపిణి చేశారన్నారు. మొదటిగా నాడు 20 గణపతుల నుండి మొదలు కొని నేడు 2000 మట్టి గణపతులను అందింస్తున్నాడంటే ఆయన నిస్వార్థ రామభక్తి అభినందనీయమని మాటలకు అందనిదన్నారు. రాముని కోసమే జీవితాన్ని అంకితం చేసి నేడు మరో రామదాసుగా ప్రజలు నాలుకల్లో నిలిచారన్నారు. 500కోట్ల రామనామాలను పూర్తి చేయించి 1000కోట్లకు శ్రీకారం చుట్టడం భక్తి రంగానికే గర్వకారణం అన్నారు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ భగవంతుని సేవలో ప్రతిరోజు గడపడం రామకోటి రామరాజు భక్తికి నిదర్శనం అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే అతని తపన ఆరాటం 21 సంవత్సరాలనుండి మట్టి విగ్రహాల పంపిణిలో కనబడుతుందన్నారు. సామాజిక సమరసత రాష్ట్ర అధ్యక్షులు ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ ఎన్నో ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తుల్లో చైతన్యాన్ని తీసుకురావడం రామకోటి రామరాజుకె సాధ్యం అన్నారు. మట్టి విగ్రహాలను 21 సంవత్సరాలనుండి ఉచితంగా పంపిణి చేయడం అన్నది రామ భక్తికి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ కనకాచారి, రాళ్లబండి లక్ష్మణ్ చారి, నిమ్మ రమేష్ పాల్గొన్నారు.