మేడ్చల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభం
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ 24 (ప్రశ్న ఆయుధం): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కేంద్రం మేడ్చల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్, పట్నం మహేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రేశ్ యాదవ్, ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి, కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి, భూపతి రెడ్డి, టీపీసీసీ సభ్యులు, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి జరుగుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర ద్వారా నాయకులు, కార్యకర్తల్లో బలమైన విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గం, బ్లాక్, మున్సిపాలిటీ, మండలం, డివిజన్ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.