మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయo ను ప్రారంభించిన.,..బండి రమేష్
ప్రశ్న ఆయుధం ఆగస్టు 24: కూకట్‌పల్లి ప్రతినిధి
నూతనంగా నిర్మించిన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయo ఆదివారం మేడ్చల్లో ఘనంగా ప్రారంభమైంది .ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ , పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షుడు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జ్ మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ చేతుల మీదుగా ఈ కార్యాలయాన్నీ ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేష్ వారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. కూకట్పల్లి నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి ర్యాలీగా తరలి వెళ్లారు.