నానో యూరియా పై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన

నానో యూరియా పై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన

గ్రామ వ్యవసాయ విస్తీర్ణ అధికారి జ్ఞానేశ్వర్

ప్రశ్న ఆయుధం 25 ఆగస్ట్ ( బాన్సువాడ ప్రతినిధి)

బాన్సువాడ మండలంలోని హన్మాజిపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని సంగ్రాం తాండ గ్రామంలో వరి పంట పొలాలను గ్రామ వ్యవసాయ విస్తీర్ణ అధికారి జ్ఞానేశ్వర్ పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…నానో యూరియా పై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు.అర లీటర్ నానో యూరియా బాటిల్ 1 యూరియా బస్తాతో సమానం అనీ నానో యూరియా స్ప్రే చేయడం వల్ల మొక్కలు నత్రజనిని త్వరగా గ్రహించుకుంటాయని ఇది పర్యావరణహితమని అన్నారు. యూరియా వెదజల్లే బదులు యూరియా స్ప్రే లాభదాయాకయాన్ని ఇస్తుందని తెలిపారు.ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో ఆకు ముడత పురుగు ఉధృతి ఉందని పురుగు నివారణకు ఎకరాకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50sp లేదా క్లోరంట్రేనిపోల్ 0.25 గ్రాముల మందును నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలని ఏఈఓ సూచించారు.ఈ కార్యక్రమం లో బోర్లం సొసైటీ చైర్మన్ సంగ్రాం నాయక్,రైతులు బానోత్ యశ్వంత్ ఆంగోతు రవి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment