కుమారస్వామి జన్మదినము
వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
ప్రశ్న ఆయుధం ఆగస్టు 25: కూకట్పల్లి ప్రతినిధి
కెపిహెచ్బి లోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో చైర్మన్ కుమారస్వామి జన్మదినము సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వేడుకల్లో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన సొంత నిధులతో 25 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం కుమారస్వామి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించే దిశగా వారికి శిక్షణ తరగతులు నిర్వహించి అనంతరం కుట్టు మిషన్లు అందించడం ఎంతో సంతోషంగా ఉందని, అంతేకాకుండా కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రత్యేకంగా మహిళలకు పార్కులను నిర్మించడం ,వారు ఆర్థికంగా బలపడడానికి తక్కువ వడ్డీ రుణాలు అందించడం వృత్తి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, బి ఆర్ ఎస్ నాయకులు రాజేష్ రాయి, తదితరులు పాల్గొన్నారు.