మట్టి గణపతులను పంపిణి చేసిన రామకోటి రామరాజు దంపతులు

మట్టి గణపతులను పంపిణి చేసిన రామకోటి రామరాజు దంపతులు

● 2000వేల మట్టి విగ్రహలు పంపిణి చేసిన రామకోటి సంస్థ

● గత వారం రోజుల నుండి గణపతులను తయారిలో రామకోటి

ప్రశ్న ఆయుధం 26ఆగష్టు, గజ్వెల్

వినాయక చవితికి పండుగ పర్వదినాన్న మట్టి గణపతులనే వాడాలని ప్లాస్టరప్ తో జీవారసులకు ముప్పు వాటిల్లుతుందని భక్తులకు రామకోటి కార్యాలయంలో మంగళవారం నాడు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. అనంతరం మట్టి గణపతులను రామకోటి కార్యాలయంలో భక్తులకు ఉచితంగా పంపిణి చేశారు రామకోటి రామరాజు దంపతులు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గత 21సంవత్సరాలనుండి ఏ ఆటంకము లేకుండా స్వయంగా తయారుచేసి భక్తులకు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత వారం రోజుల నుండి మా కుటుంబ సభ్యులం అందరం కలిసి మట్టితో గణపతులను తయారు చేయడం మా అదృష్టం అని ఆనందాన్ని తెలిపారు గత 2 రోజుల నుండి రామకోటి కార్యాలయంలో భక్తులకు గణపతులను పంపిణి చేస్తున్నామన్నారు. ఇప్పటికి 2000 వేల మట్టి విగ్రహాలు పంపిణి చేశామన్నారు. భగంతునికి సేవకు మించిన భాగ్యం మరొకటి లేదన్నారు. అందరికి గణపతి ఆశీస్సులు కలగాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment