సర్టిఫికెట్‌ల జారీలో జాప్యం వద్దు: అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి!

సర్టిఫికెట్‌ల జారీలో జాప్యం వద్దు: అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి!

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం ఆగస్టు 26

రెవెన్యూ శాఖలో పౌరులకు అవసరమైన వివిధ రకాల సర్టిఫికెట్‌లను జారీ చేయడంలో జాప్యం చేయవద్దని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా, నిర్దేశిత సమయంలోనే దరఖాస్తులను పరిశీలించి, సర్టిఫికెట్‌లను జారీ చేయాలని ఆయన సూచించారు.మంగళవారం రోజున బాచుపల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులు మరియు పరిపాలన సంబంధిత రిజిస్టర్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. కులం, స్థానికత, ఆదాయం వంటి సర్టిఫికెట్‌ల కోసం వచ్చిన దరఖాస్తుల స్థితిని అడిగి తెలుసుకున్నారు.దరఖాస్తులను సత్వరమే పరిశీలించి, అర్హులైన వారికి వెంటనే సర్టిఫికెట్‌లు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. సర్టిఫికెట్‌ల జారీలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని, పరిపాలన సంబంధిత ఫైళ్లను పెండింగ్‌లో ఉంచకుండా చూడాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే, సిబ్బంది మరియు శిక్షణ పొందిన సర్వేయర్ పనితీరు గురించి కూడా ఆయన ఆరా తీశారు.ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఆర్‌డీఓ శ్యామ్ ప్రసాద్, ఆర్‌ఐలు రేణుక, భాను చందర్, సర్వేయర్ సంధు మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు సకాలంలో సేవలు అందించేలా రెవెన్యూ అధికారులు కృషి చేయాలని ఆయన నొక్కి చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment