బాడీ బిల్డిర్ శ్రీకాంత్ ను
సన్మానించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
ప్రశ్న ఆయుధం ఆగస్టు 26: కూకట్పల్లి ప్రతినిధి
మోతి నగర్ కు చెందిన సిహెచ్. శ్రీకాంత్ జాతీయ స్థాయిలో బాడీ బిల్డింగ్ లో బంగారు పతకం సాధించిన సందర్భంగా మంగళవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో ఆ యువకుడ్ని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన యువకులు రాష్ట్ర ,జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడల విభాగంలో అత్యున్నత పురస్కారాలు సాధించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని,తల్లితండ్రులు కూడా పిల్లల్ని క్రీడలు పట్ల ప్రోత్సహిస్తే దేశానికి మంచి పేరు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగిస్తాయని నియోజకవర్గంలో క్రీడలకు సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ తండ్రి చిన్న రమేష్ మోతి నగర్ కు చెందిన నాయకులు రాజ్ కుమార్ గౌడ్, సత్యనారాయణ,ఉదయ్ పాల్గొన్నారు.