పక్షుల విక్రయ కేంద్రాలపై ఆటవి శాఖ దాడులు

పక్షుల విక్రయ కేంద్రాలపై ఆటవి శాఖ దాడులు

అనుమతులు లేకుండా పెంపుడు పక్షులు విక్రయం

మాలపల్లి, గోల్ హనుమాన్, బోధన్ రోడ్‌లో తనిఖీలు

28 చిలుకలు, 4 ఆటవి పక్షులు, 30కి పైగా అరుదైన పక్షులు స్వాధీనం

మాలపల్లి యానిమల్ లవర్ షాప్ సీజ్

నిర్వాహకులపై కేసులు నమోదు

ప్రశ్న ఆయుధం నిజామాబాద్, ఆగస్టు 26:

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పక్షుల విక్రయ కేంద్రాలపై ఆటవి శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆటవి శాఖ అనుమతులు, పశు సంవర్ధక శాఖ ధ్రువీకరణ లేకుండా పక్షులు, అడవి జంతువుల విక్రయం జరుగుతోందని అందిన సమాచారంతో ఎఫ్‌డీఓ సుధాకర్, ఎఫ్‌పీఓ సంజయ్ గౌడ్, రాధిక ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఈ దాడులు జరిగాయి.నగరంలోని మాలపల్లి, గోల్ హనుమాన్, బోధన్ రోడ్‌లలోని పక్షుల విక్రయ కేంద్రాలను తనిఖీ చేసి, మాలపల్లిలోని యానిమల్ లవర్ షాప్‌లో 28 చిలుకలు, 4 ఆటవి పక్షులు, 3 ర్యాండ్ ఎజాస్, 9 టైటర్ బర్డ్స్, 6 కానర్, 3 ప్లానెట్ పక్షులను స్వాధీనం చేసుకున్నారు. షాప్‌ను సీజ్ చేసి, అనుమతులు లేకుండా పక్షులను విక్రయించిన నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment