జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
*విశాఖపట్నం ఆగస్ట్ 28*
‘సేనతో సేనాని సభకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా నామకరణం చేశారు. అంతేకాదు.. సభా స్థలి వద్ద ఏర్పాటు చేసిన ఐదు ప్రధాన ద్వారాలకు ఉత్తరాంధ్ర మహనీయుల పేర్లు ఫైనల్ చేశారు. జనసేన పార్టీ ఎల్లప్పుడు జాతీయ నాయకులను, మహనీయులను స్మరించుకుంటుందని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మూడు రోజుల సమావేశాలతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నిండుతుందని అన్నారు. 28 నుంచి 30 వరకు జరిగే సమావేశాల్లో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీశ్రేణులు హాజరవుతారు. నేడు వైఎంసీఏ సమావేశ మందిరంలో జరిగే జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొని.. తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తారు. మధ్యాహ్నం జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో 320 మంది కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు. 29వ తేదీన ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న 10 మందిని ఎంపిక చేసి.. వారితో వివిధ అంశాలపై అధినేత మాట