సత్యనారాయణ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో కుంకుమార్చన ఘనంగా

సత్యనారాయణ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో కుంకుమార్చన ఘనంగా

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఆగస్టు 29

సత్యనారాయణ కాలనీ అసోసియేషన్ భవనంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమార్చన పూజ భక్తిశ్రద్ధలతో జరిగింది. కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని అత్యంత శ్రద్ధగా నిర్వహించగా, కాలనీలోని మహిళా భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి పూలు, కుంకుమతో ప్రత్యేక పూజలు చేశారు.ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిన ఈ వేడుకలో మహిళలు మొక్కులు చెల్లించుకుంటూ, శుభాకాంక్షలు పంచుకున్నారు. ఈ కార్యక్రమం కాలనీ వాసులలో భక్తి భావాన్ని మరింత పెంచింది.

ఈ సందర్భానికి సాయిబాబా గుడి చైర్మన్ అన్నం రాజు శ్రీనివాస్, చిట్యాల శ్రీనివాస్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రెడ్యానాయక్‌తో పాటు అసోసియేషన్ సభ్యులు, కాలనీ పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment