ఉద్యోగంలో విశిష్ట సేవలు అందించిన హెల్త్ సూపర్వైజర్

ఉద్యోగంలో విశిష్ట సేవలు అందించిన హెల్త్ సూపర్వైజర్

పదవి విరమణ పొందిన హెల్త్ సూపర్వైజర్ రత్నకుమారిని ఘనంగా సన్మానించిన డి ఎం హెచ్ ఓ డిప్యూటీ డిఎంహెచ్వో సహచర ఉద్యోగులు

జమ్మికుంట ఆగస్టు 29 ప్రశ్న ఆయుధం

ఉద్యోగంలో విశిష్ట సేవలు అందించిన హెల్త్ సూపర్వైజర్ రత్నకుమారి ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా జిల్లా వైద్యాధికారి వెంకటరమణ డిప్యూటీ డిఎంహెచ్ఓ చందు సహచర ఉద్యోగులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య అధికారి మాట్లాడుతూ రత్నకుమారి చేసిన సేవలు మరుపురానివని వారి శేష జీవితం కూడా సుఖ సంతోషాలతో మానవ సేవకు అంకితం చేయాలని కోరారు మొదటగా రత్నకుమారి గురించి వివరిస్తూ చదివిన చదువుకు సార్ధకత చేకూర్చాలని ఉద్దేశంతో ఉద్యోగ జీవితం ప్రారంభించిన రత్నకుమారి 1991లో ఖమ్మం జిల్లా వేంసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసి రిక్వెస్ట్ ట్రాన్స్వర్ పై బదిలీ కాబడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగభూపాలెం ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేశారు 16 సం॥లు సుదీర్ఘ కాలం పల్లె ప్రజలకు ఆరోగ్య సేవలు అందించారు. 2010 లో ప్రభుత్వ ఆదేశానుసారము బదిలీ కాబడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రేగళ్ళ ప్రాథమిక ఆరోగ్యకేంద్ర S/C కారుకొండ రామారం లో చేరినారు. 6 సం॥లు అక్కడ మనసా వాచా కర్మణా సేవలందించి ఆత్మీయమైన అంతరంగాలను ఆవిష్కరించారు.2016 లో ప్రమోషన్ పొంది పెద్దపల్లి జిల్లా. జూలపల్లి మండలం, ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో హెల్త్ సూపర్ వైజర్ గా చేరారు ఆత్మీయమైన అంతరంగాలని ఆవిష్కరించి, అద్భుతమైన సేవలు అందించి 2020 లో బదిలీపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసి ప్రాణముకన్నా కర్తవ్యంమిన్న అనే భావనతో 2020 లో వచ్చిన కరోనా మహమ్మారిని ఎదుర్కొని వందలాది మంది రోగులను పరీక్షించి వారిలో ధైర్యాన్ని నింపి అమ్మలా ఆదరించిన మహోన్నత వ్యక్తి రత్నకుమారి ప్రభుత్వము తీసుకు వచ్చిన జీ.వో. 317 ద్వారా బదిలీ కాబడి కరీంనగర్ జిల్లా, జమ్మికుంట మండలం, వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2022 లో చేరి నేటి వరకు(2025 )సుఖము కన్నా బహు జనహితమే మిన్న అనే భావనతో సేవలు అందించి ఉద్యోగ విరమణ చేయుచున్న సేవాజీవి. పదవి విరమణ వీడ్కోలు సమావేశానికి హాజరైన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట రమణ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు పి ఓ ఎం సి హెచ్ సన జవేరియా వైద్యాధికారులు డాక్టర్ వరుణ, డాక్టర్ తులసీదాస్,ఎం ఎల్ హెచ్ పి డాక్టర్స్,హెల్త్ ఎడ్యుకేటర్స్ పంజాల ప్రతాప్ గౌడ్, మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment