ఎడారిని తలపిస్తున్న కన్నాపూర్ చెరువు…

ఎడారిని తలపిస్తున్న కన్నాపూర్ చెరువు…

లింగంపేట్ మండలంలో 500 ఎకరాల పెద్ద చెరువు కట్ట తెగిపోవడంతో పంట పొలాలు ఇసుక మయం.

వరదల దాటికి ప్రధాన రహదారి బ్రిడ్జి కూలిపోవడంతో రాకపోకలు స్థంభనం

గ్రామంలో 15 ఇళ్లు కూలిపోవడంతో ప్రజలు నిరాశ్రయులు

రెండు కళాల పంటకు ప్రమాదం, రైతులు ఆవేదన

చెరువు కట్ట పునర్నిర్మాణం, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని టీజెస్ నేత డా. నిజ్జన రమేష్ డిమాండ్

కన్నాపూర్‌లో వరద విలయం

ప్రశ్న ఆయుధం ఆగష్టు 30 కామారెడ్డి..మూడురోజులుగా కురుస్తున్న వర్షానికి లింగంపేట్ మండలం కన్నాపూర్ గ్రామం దెబ్బతింది. 500 ఎకరాల పెద్ద చెరువు కట్ట తెగిపోవడంతో వాగుని తలపించేలా నీరు పొలాల్లోకి దూసుకెళ్లింది. పంట పొలాలు ఇసుక మయమవగా… రైతులు “అన్నమో రామచంద్ర” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరద దాటికి గ్రామంలోని ప్రధాన రహదారి బ్రిడ్జి కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడపాల్సిన పరిస్థితి. గ్రామంలో 15 ఇళ్లు కూలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని స్థానికులు వాపోతున్నారు.

గ్రామ సమస్యలను స్వయంగా కలెక్టర్ పరిశీలించాలని టీజెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. నిజ్జన రమేష్ డిమాండ్ చేశారు. చెరువు కట్టను తక్షణం పునర్నిర్మించాలని, లేకపోతే రాబోయే వర్షాల్లో నీరు నిల్వ ఉండదని, రెండు కళాల పంటలు నష్టమవుతాయని హెచ్చరించారు.

అలాగే, గ్రామ రైతుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో టీజెస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ నేత నిజ్జన విట్టల్, స్థానికులు కాశీరం, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment