నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారి రాజలింగం

నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారి రాజలింగం

గాంధారి మండలంలో వరి పొలాలు వరద నీటిలో మునిగిపోవడంతో ఇసుక కప్పేసింది

మాత్ సంగం, పెట్‌సంగెం, రామలక్ష్మణపల్లి, సర్వాపూర్, గండివేట్, చెన్నాపూర్, పెద్దగుజ్జులు, గుర్జాల్ గ్రామాల్లో పంట నష్టం తీవ్రం

వరి, సోయాబీన్, పత్తి, మొక్కజొన్న పొలాలన్నీ నీట మునిగాయి

రైతుల బాధలను విన్న అధికారి — నివేదిక సిద్ధం చేసేందుకు హామీ

వరి పొలాల్లో ఇసుక వాన… వ్యవసాయ అధికారి పరిశీలన

ప్రశ్న ఆయుధం, ఆగస్టు 30 (కామారెడ్డి జిల్లా గాంధారి)

గాంధారి మండలంలో వరదలు రైతులకు గట్టి దెబ్బ కొట్టాయి. వరి పొలాలు మునిగిపోగా, పైగా ఇసుక కప్పేయడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

మాత్ సంగం, పెట్‌సంగేం రామలక్ష్మణపల్లి, సర్వాపూర్, గండివేట్, చెన్నాపూర్, పెద్దగుజ్జులు, గుర్జాల్ గ్రామాల్లో పంట నష్టం విస్తారంగా నమోదైంది. వరి, సోయాబీన్, పత్తి, మొక్కజొన్న పొలాలన్నీ వరద ముంపులో చిక్కి రైతులు నిరాశలో మునిగారు.

ఈ పరిస్థితిని ప్రత్యక్షంగా గమనించేందుకు వ్యవసాయ శాఖ అధికారి రాజలింగం శుక్రవారం గ్రామాల పర్యటన చేపట్టారు. పంట పొలాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడి, నష్టాన్ని అంచనా వేశారు. త్వరలో నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తానని ఆయన రైతులకు హామీ ఇచ్చారు.

🌾 రైతుల గుండెల్లో ధైర్యం నింపే చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment