ప్రపంచ స్థాయిలో సైన్సిస్టులుగా మేమేముందుంటాం
విజ్ఞాన మేళ లో శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు ఆనందోత్సవాలు
పరిశీలకులు (జడ్జిలకు) అంతుచిక్కని ప్రయోగాలు
జమ్మికుంట ఆగస్టు 30 ప్రశ్న ఆయుధం
ప్రపంచ స్థాయిలో సైంటిస్టులుగా మేము ముందుంటామని విజ్ఞాన మేళాలో సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు పేర్కొన్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విభాగ్ స్థాయి (కరినగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల,సిద్దిపేట జిల్లాల) గణిత, విజ్ఞానం, సాంస్కృతీ విజ్ఞాన మేళ కార్యక్రమం రెండు రోజులపాటు ఘనంగా నిర్వహించారు విజ్ఞాన మేలకు 16 పాఠశాలల నుండి సుమారు 350 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరై మంచి మంచి ప్రయోగాలు నిర్వహిస్తూ జడ్జీల ద్వారా వివిధ పాఠశాల విద్యార్థుల ద్వారా మెప్పు పొందారు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఎంతో సంతోషం వెలుబస్తూ మేము రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా పాల్గొని జమ్మికుంటని స్ఫూర్తిగా తీసుకుంటామని ఆనందాన్ని వెలుబుచ్చారు, ఈ రెండు రోజులైనా కార్యక్రమంలో మొదటిరోజు మంతెన హేమలత పాల్గొని విద్యార్థులు ఎంతో చక్కగా సైన్స్ ఎగ్జిబిట్స్ తయారు చేసి వివరణ ఇచ్చారని తెలిపారు డాక్టర్ చిట్టి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మన నిత్యజీవితంలో గణితం ఎంతగానో ఉపయోగ ఉంటుందని అలాగే చిన్ననాటి నుండే సైన్స్ పట్ల అభిలాషను పెంచుకొని సైంటిస్టులుగా ఎదగాలని తెలిపారు నీలం వెంకటేశ్వర్లు సైంటిస్ట్ కృషి విజ్ఞాన కేంద్రం వారు మాట్లాడుతూ మన పర్యావరణాన్ని కాపాడుకోకపోతే మనకు మనుగడ లేదని తెలిపినారు గవర్నమెంట్ డిగ్రీ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ బొడ్డు రమేష్ మాట్లాడుతూ నైపుణ్యం ఉన్నదానిని పెంపొందించుకోవాలని నైపుణ్యాన్ని సమాజానికి అవసరమే వాటిని మాత్రమే తయారుచేసి జాతికి అంకితం ఇవ్వాలని కోరారు కార్యక్రమంలో ముక్కాల సీతారాములు కరీంనగర్ విభాగ్ అధ్యక్షుడు తేళ్ళ రాజమౌళి సిరి సరస్వతి దేవి కరీంనగర్ జిల్లా కార్యదర్శి, డాక్టర్ కనివేని తిరుపతి బొడ్ల శ్రీనివాస్ సరస్వతి విద్యాపీఠం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ దేవేందర్ రెడ్డి, డాక్టర్ రాము మేచినేని దేవేందర్ రావు సరస్వతీ విద్యాపీఠం కరీంనగర్ విభాగ్ కార్యదర్శి , సమితి అధ్యక్ష కార్యదర్శులు శ్రీ ఆవాల రాజారెడ్డి, ఆకుల రాజేందర్, ప్రబంధకారిని అధ్యక్ష కార్యదర్శులు శీలం శ్రీనివాస్, దాసరి రవీందర్ ప్రధానాచార్యులు గుడికందుల సుదర్శన్, పొలసాని సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు