ప్రతి పౌరునికి ప్రాథమిక హక్కులను పొందేలా చూడడం ప్రభుత్వ అధికారుల బాధ్యత

ప్రతి పౌరునికి ప్రాథమిక హక్కులను పొందేలా చూడడం

ప్రభుత్వ అధికారుల బాధ్యత

పౌర హక్కుల దినోత్సవం లో తాసిల్దార్ రాజమల్లు

జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్టు 30 ప్రశ్న ఆయుధం

ప్రతి నెల నిర్వహించే పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ఇల్లందకుంట మండలంలోని బూజునూరు గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని మండల తాసిల్దార్ రాజమల్లు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ప్రతి పౌరునికి హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఉద్దేశంతో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు జాతి, మతం లేదా ఇతర వ్యక్తిగత లక్షణాలతో సంబంధం లేకుండా చట్టం ప్రకారం సమాన సామాజిక అవకాశాలు రక్షణను అందించడమే పౌర హక్కులు అని వీటిలో ఓటు హక్కు, న్యాయమైన విచారణ, ప్రభుత్వ విద్య, ప్రజా సౌకర్యాల వినియోగం వంటివి ఉంటాయని పౌరులు తమ ప్రాథమిక హక్కులను పొందేలా చూడటం, ప్రభుత్వ ఉద్యోగులు మెరుగైన సేవలు అందించడం, సమాజంలో కుల వివక్షను రూపుమాపడం వంటివి పౌర హక్కుల దినోత్సవం ప్రధాన ఉద్దేశాలని తాసిల్దార్ రాజమల్లు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై క్రాంతి కుమార్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ నాగరాజు జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ మాజీ ప్రజా ప్రతినిధులు రెవిన్యూ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment