తడ్కల్ మండల సాధనకై మరో మారు రిలే దీక్షకు కదం తొక్కనున్న సభ్యులు
ఇసారి ఎలాగైనా మండల్ సాధించే వరకు వదిలే ప్రసక్తే లేదు
ప్రశ్న ఆయుధం న్యూస్ నారాయణఖేడ్ నియోజకవర్గం ఆగస్ట్-30
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం లోని మేజర్ గ్రామ పంచాయతీ అయిన తడ్కల్ ను. గత ప్రభుత్వం తెలంగాణాలో పలు గ్రామాలను మండలాలుగా చేసిన సమయం లో ఇ తడ్కల్
గ్రామాన్ని మండలం గా చేస్తాము అని చెప్పి చేయలేదు. అందుకు తడ్కల్ చుట్టు ఉన్న 15 గ్రామాల ప్రజలు ,నాయకులతొ కలిసి మూడు నెలల పాటు మండల సాధనకై రిలే నిరాహార దీక్ష చెప్పట్టడం జరిగింది.
అదే సమయం లో ఎమ్మెల్లే ఎన్నికలు వచ్చాయి.. అప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు,బిజెపి నాయకులు తమ ప్రభుత్వం రాగానే మండల్ చేసే బాధ్యత మాది అంటే మాది అని హామీ ఇచ్చి వెళ్లి పోయారు. ఆనాటి అధికార ప్రభుత్వం మండల్ ఏర్పాటు చేస్తున్నట్టు గేజిట్ నోటిఫికెషన్ ప్రకటించారు. అప్పుడే ఎన్నికల కోడ్ రావడం తోటి అది పెండింగ్ లో పడింది. కాని ఇప్పటికి మండలం గా ఏర్పాటు కాలేదు..
గత దీక్షలో హామీ ఇచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్లే,ఎంపీ లు ప్రభుత్వ మెడలు వంచైనా
మాకు మండలం గా ఏర్పాటు చేసి ప్రజల కళ నెరవేర్చాలి..అప్పటి వరకు వదిలె ప్రసక్తే లేదు..
అందుకు వచ్చే నెల సెప్టెంబర్ 11 వ తేదీ నుండి మరోసారి 15 గ్రామాల ప్రజలతో కలిసి తడ్కల్ రిలే నిరాహార దీక్షను మొదలు పెట్టడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క యువకుడు ప్రజలు ఇ దీక్షకు సపోర్ట్ చేసి అందరు పాల్గొనవలసిందిగా సాధనసమితి నాయకుడు రాజ్ కుమార్ పాటిల్ తెలిపారు..వీరి వెంట పలువురు సభ్యులు ఉన్నారు…