నిండు గర్భిణీ దారుణ హత్య..
ఆస్తిలో వాటా పోతుందని మహిళ హత్య
నిందితుడు ముద్ర బోయిన బన్నీ తేజ
సీఐ లక్ష్మీనారాయణ ఎస్ఐ క్రాంతి కుమార్
జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్టు 30 ప్రశ్న ఆయుధం
నిండు గర్భిణీ దారుణ హత్యకు గురైన సంఘటన శనివారం రోజు సాయంత్రం 6 గంటల 30ని లకు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని టేకుర్తి గ్రామంలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామంలో గల ఒగ్గు కళాకారుడు ముద్రబోయిన రాములు కు రెండు పెండ్లిల్లు చేసుకున్నాడు అతని మొదటి భార్య రేణుక రెండవ భార్య తిరుమల ఉన్నారు రెండవ భార్య తిరుమలను గత పది సంవత్సరాల క్రితం వివాహం చేసుకోవడం జరిగిందని వ్యూహం చేసుకున్నప్పటి నుండి మొదటి భార్యకు రెండవ భార్యకు గొడవలు జరుగుతూ ఉండేవని మొదటి భార్యకు ఇద్దరు కుమారులు ఉండేవారని గంటకి కుమారులకు మధ్య అనేకసార్లు పంచాయితీ జరిగిందని ఇద్దరు భార్యలకు ఎవరు ఇంటిని వారికి కేటాయించిన తమ ఆస్తిలో పిన్న తల్లికి వాటా పోతుందనే ఉద్దేశంతో మొదటి భార్య కుమారుడైన బన్నీ తేజ ఏడు నెలల గర్భవతి తిరుమల పై కత్తితో దాడి చేసి గొంతు కోసి చంపినట్లు పోలీసుల కథనంలో బయటపడినట్లు సీఐ లక్ష్మీనారాయణ ఎస్ఐ క్రాంతి కుమార్ పేర్కొన్నారు మృతి చెందిన మృతురాలు యొక్క స్వగ్రామమైన చిగురు మామిడి మండలం బొమ్మనపల్లిగా స్థానికులు తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మీనారాయణ ఎస్ఐ క్రాంతి కుమార్ పేర్కొన్నారు