సిఎం సమీక్షలో డిపిఆర్ఓకి నో ఎంట్రీ..?
వరద ముప్పు ప్రాంతాల పర్యటన అనంతరం సిఎం కామారెడ్డిలో సమీక్ష సమావేశం.!
జిల్లా అధికారులు హాజరుకాగా, కొందరికి ప్రవేశం నిరాకరణ.!
ముఖ్యంగా మీడియా కోఆర్డినేషన్ బాధ్యతలున్న డిపిఆర్ఓకే నో ఎంట్రీ!
పోలీస్ శాఖ ఆంక్షలతో నిరాశ, కలకలం.!
ప్రజాసంబంధ విభాగంపై అనుచిత వైఖరిపై విమర్శలు..!
ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 4కామారెడ్డి:
కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరద ముప్పు తలెత్తిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. అనంతరం జిల్లా సమీకృత కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనగా, కొందరు జిల్లా అధికారులను పోలీసులు ఆపేయడం గమనార్హం. ముఖ్యంగా మీడియా సమన్వయ బాధ్యతలు నిర్వహించే డిపిఆర్ఓకి కూడా “నో ఎంట్రీ” చెప్పడంతో కలకలం రేగింది. దీనిపై అధికార వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతుండగా, ప్రజాసంబంధ శాఖను నిర్లక్ష్యం చేసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.