ప్రభుత్వ కార్యాలయంలో బర్త్‌డే పార్టీ డ్యూటీ వేళల్లో వినోదం: నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తప్పవా..?

ప్రభుత్వ కార్యాలయంలో బర్త్‌డే పార్టీ డ్యూటీ వేళల్లో వినోదం: నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తప్పవా?

డ్యూటీ టైమ్‌లో మూడు గంటల పాటు బర్త్‌డే వేడుకలు…!

ప్రభుత్వ సేవా నిబంధనలకు విరుద్ధమైన చర్య..!

ఉన్నతాధికారుల నుంచి క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరిక.!

ప్రశ్న ఆయుధం, కామారెడ్డి సెప్టెంబర్ 04 : ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో ఉన్నప్పుడు పూర్తి సమయాన్ని ప్రజల సేవకు కేటాయించాలి. కానీ, ఒక ప్రభుత్వ కార్యాలయంలో సూపరింటెండెంట్ తన పుట్టినరోజు వేడుకలను డ్యూటీ వేళల్లో ఘనంగా జరుపుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యాలయంలోనే ఈ పార్టీ జరిగినట్టు సమాచారం.

నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలుప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే చట్ట ప్రకారం ఉద్యోగులు ఎల్లప్పుడూ నిజాయితీ, అంకితభావంతో వ్యవహరించాలి. విధుల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత వేడుకలు జరుపుకోవడంఈనిబంధనలను ఉల్లంఘించడమేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ సంఘటనకు సంబంధించి మెమో, వార్నింగ్ వంటి తేలికపాటి చర్యల నుంచి క్రమశిక్షణాత్మక చర్యల వరకు తీసుకునే వీలుందని ప్రభుత్వవర్గాలుచెబుతున్నాయి.ప్రజలకోసంకేటాయించబడిన సమయాన్ని వ్యక్తిగత వినోదాలకు వాడటం సరైనది కాదని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment