విద్యార్థులు మంచి ప్రయోజకులుగా ఎదగాలి

విద్యార్థులు మంచి ప్రయోజకులుగా ఎదగాలి

*రాష్ట్ర కళాశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ప్రొ. DSR రాజేందర్ సింగ్*

*జమ్మికుంట సెప్టెంబర్ 4 ప్రశ్న ఆయుధం*

విద్యార్థులు ఇష్టపడి బాగా చదువుకోవాలని, భవిష్యత్తులో మంచి ప్రయోజకులుగా ఎదగాలని రాష్ట్ర కళాశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ప్రొ. రాజేందర్ సింగ్ అన్నారు. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల పూర్వ విద్యార్థి, ప్రముఖ పారిశ్రామిక వేత్త బచ్చు భాస్కర్ సహకారంతో రెండవ సంవత్సరం ప్రిన్సిపాల్ డా. బి రమేష్ అధ్యక్షతన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని గురువారం జాయింట్ డైరెక్టర్ వర్చ్యువల్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మధ్యాహ్న భోజనం సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలను సాధించాలన్నారు. డిగ్రీ తర్వాత విద్యార్థులు పీజీ, లా, వంటి ఉన్నత చదువులకు సిద్ధం కావాలన్నారు. జేఎన్ టి యు వంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో సీట్లు సాధించాలన్నారు ఉన్నత చదువులతో పాటు ఉద్యోగ పోటీ పరీక్షలు రాయాలన్నారు. సివిల్స్, గ్రూప్ -1 వంటి ఉన్నత ఉద్యోగాలు సాధించి చరిత్ర సృష్టించాలన్నారు. కళాశాలలోని అధ్యాపకులు విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్, సబ్జెక్టుల పై పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. సివిల్స్, గ్రూప్-1,2, వంటి పరీక్షలపై అవగాహన పెంపొందించాలన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిర్వహించిన పూర్వ విద్యార్థి బచ్చు భాస్కర్ ను, కళాశాల ప్రిన్సిపాల్ ను, అధ్యాపకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్-ప్రిన్సిపాల్ డా.ఎస్. ఓదెలు కుమార్, అకాడమిక్ కో-ఆర్డినేటర్ డా. కే. రాజేంద్రం, డా.కే. గణేష్, డా. శ్యామల, డా. మాధవి, రాజకుమార్, ఉమాకిరణ్, డా.ఎంబాడి రవి, ఎల్.రవీందర్, శ్రీనివాస్ రెడ్డి, సుష్మ, మమత, శ్రీనివాస్, ప్రశాంత్, సాయికుమార్, అరుణ్ రాజ్, రమేష్, అనూష, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment