ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా
ఉత్తమ ఉపాధ్యాయుడిని సన్మానించిన పిడిశెట్టి రాజు
సిద్దిపేట జిల్లా, కోహెడ మండలం సెప్టెంబర్ 5:
భారత మాజీ రాష్ట్రపతి, తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ 138వ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని సామాజిక కార్యకర్త, కాంటెస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ –
“దేశానికి రెండవ రాష్ట్రపతిగా సేవలందించిన రాధాకృష్ణయ్య పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ప్రతి గురువు గౌరవానికి ప్రతీక. గురువులను గౌరవించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది” అని పేర్కొన్నారు.
వేడుకల్లో మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ టీజీ మైనారిటీ గురుకుల రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్ డాక్టర్ పిడిశెట్టి సంపత్‌ను ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తించి శాలువాతో ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు పి. భూమయ్య, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.