ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డుకు ఎంపికైన 17మంది ఉపాధ్యాయులను సన్మానించిన ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ ఆర్సి ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 10
బాన్సువాడ పట్టణం మున్సిపల్ కార్యాలయంలో బాన్సువాడ మండల ఉత్తమ ఉపాద్యాయులుగా అవార్డుకు ఎంపికైన 17 మంది ఉపాద్యాయులను సన్మానించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు ఈసందర్భంగా పోచారం మాట్లాడుతూ.ఉత్తమ ఉపాద్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు.
సమాజం మార్పు చెందాలంటే ఉపాధ్యాయుల వల్లే సాధ్యమవుతుంది
నేడు విద్య లేక పోతే విలువ లేదు. ఆ విలువను అందిస్తున్నది ఉపాధ్యాయులు.
పాఠశాల దేవాలయం, అందులో పనిచేసే ఉపాద్యాయులు దేవుళ్ళు.వసతులు, మౌళిక సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత, వాటిని ఉపయోగించి విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఉపాద్యాయుల బాధ్యత.బాన్సువాడ నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చాను, వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి