వరద బాధితులకు ఆర్థిక సహాయం
బాన్సువాడ ఆర్సి కృష్ణ ఆయుధం సెప్టెంబర్ 11
ఆగస్టు మాసంలో కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల పాక్షికంగా మరియు పూర్తిగా ఇండ్లు కోల్పోయిన బాధితులకు రామకృష్ణ మిషన్ బేలూరు మట్, వెస్ట్ బెంగాల్ మరియు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం బీర్కూరు గ్రామంలో (10) మంది బాధితులకు నిత్యవసర సరుకులను @ ఒక్కొక్క కిట్టు సుమారు విలువ రూ.3125/. విలువగల కిట్లను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కే సాయి భుజంగరావు, ఎంపీడీవో మహబూబ్, సూపరిండెంట్ భాను ప్రకాష్ నయాబ్ తాసిల్దార్ రవికుమార్, గిర్ధవర్ విజయ్ కుమార్, ఎంపీ ఎస్ఓ వెంకటరమణ, గ్రామ కార్యదర్శి గంగారాం మరియు బీర్కూర్ మండల మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు