ఆర్థిక సహాయం అందించిన కోనేరు శశాంక్

ఆర్థిక సహాయం అందించిన కోనేరు శశాంక్

 

 

బాన్సువాడ ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 11

 

 

బాన్సువాడ నియోజకవర్గ, పోతంగల్ మండలం, కల్లూరు గ్రామానికి చెందిన ఒంటరి మహిళ కోడిచెర్ల సాయమ్మ కు చెందిన రేకుల షెడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోవడం జరిగింది.ఆమెకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో విషయం తెలుసుకున్న మన బిజెపి బాన్సువాడ నియోజకవర్గ నాయకులు కోనేరు శశాంక్ సహృదయంతో స్పందించి తమ కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆమెకు 5000 రూపాయల తక్షణ సహాయం అందించడం జరిగింది. మరియు రాబోయే రోజులలో ఆమెకు సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తానని భరోస ఇవ్వడం జరిగింది, ఇట్టి కార్యక్రమానికి నియోజకవర్గ నాయకులు ఎం. ప్రకాష్ పటేల్, నాయకులు డి. ముక్కయ్య, మేత్రి కిరణ్, ఓమన్న పటేల్, ఎం.సంతోష్ పటేల్, గంగాధర్ పటేల్, బూత్ అధ్యక్షులు వినోద్, రమేష్, విజయ్ మరియు కల్లూరు గ్రామానికి చెందిన యువకులు హాజరు కావడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment