కామారెడ్డి పట్టణంలో పర్యటించిన కలెక్టర్.

కామారెడ్డి పట్టణంలో పర్యటించిన కలెక్టర్.

భారీ వర్షాల నేపాధ్యంలో దెబ్బతిన్న ప్రాంతాల్లో అత్యంత వేగంగా పునరుద్ధరణ పనులు చేపట్టాలి.

శాశ్వత పరిష్కారానికి ప్రణాళిక చేపట్టాలి అధికారులకు కలెక్టర్ ఆదేశం.

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్.

(ప్రశ్న ఆయుధం )సెప్టెంబర్ 21 కామారెడ్డి :

శనివారం జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి పట్టణంలో పర్యటించి భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న హౌసింగ్ బోర్డ్ వైకుంఠధామం యందు అత్యవసరంగా ఏర్పాటు చేయబడుతున్న రోడ్డు పనులను మరియు వాటర్ సప్లై ఫిల్టర్ బెడ్ ను సందర్శించి వెంట ఉన్న ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు రెవెన్యూ అధికారుల కు వెంటనే అత్యవసరంగా పునరుద్ధరణ పనులను చేపట్టవలసిందిగా ఆదేశించినారు. అలాగే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించవలసిందిగా మరియు తాత్కాలిక మరమ్మతులు వెంటనే చేపట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనిఆదేశించినారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వీణ, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ రాజేందర్ రెడ్డి,మున్సిపల్ ఇంజనీర్ శంకర్, వేణు ప్రసాద్, కామారెడ్డి డిప్యూటీ తహసిల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now