✦ సమగ్ర శిక్షా ఉద్యోగుల వేదన – సీఎం హామీ నిలబెట్టాలి ✦

✦ సమగ్ర శిక్షా ఉద్యోగుల వేదన – సీఎం హామీ నిలబెట్టాలి ✦

రెగ్యులరైజేషన్ హామీకి రెండేళ్లు, ఇంకా పరిష్కారం లేక నిరాశ

“ప్రామిస్ డే”గా గుర్తు చేసిన నిజామాబాద్ జిల్లా సంఘం

హనుమకొండ ఏకశిలా పార్క్ వేదికపై సీఎం ఇచ్చిన మాటను గుర్తు

వేతనాలు, ఉద్యోగ భద్రత లేక ఇబ్బందుల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులు

సమ్మె విరమణ ఒప్పందం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్

ప్రశ్న ఆయుధం నిజామాబాద్, సెప్టెంబర్ 13:

తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ రెండు సంవత్సరాలు పూర్తయ్యాక కూడా అమలు కానందున తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కె.రాజు, ప్రధాన కార్యదర్శి ఉపేందర్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, హనుమకొండలోని ఏకశిలా పార్క్ వేదికగా 2023 సెప్టెంబర్ 13న అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి “మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో, సచివాలయంలో చాయ్ తాగే లోపు జీవో జారీ చేసి రెగ్యులరైజ్ చేస్తాను” అని ఇచ్చిన హామీని గుర్తు చేశారు.

ఈ రోజు “ప్రామిస్ డే”గా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు.

ఉద్యోగ భద్రత లేక, తగిన వేతనాలు లేక విద్యా వ్యవస్థలో కష్టాలు ఎదుర్కొంటున్నామని, గత సంవత్సరం సమ్మె విరమణ సమయంలో ఆర్థిక, ఆర్థికేతర అంశాల పరిష్కారం కోసం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు మూడు అంశాలు మినహా మిగతా సమస్యలు అలాగే ఉండిపోయాయని తెలిపారు.

సంఘం నాయకులు ప్రభుత్వం తక్షణమే స్పందించి సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ఆరోగ్య కార్డులు జారీ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించాలని, ముఖ్యంగా సమ్మె విరమణ ఒప్పందాలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now