హైదర్ నగర్ మండల పరిషత్ పాఠశాల లో ఉపాధ్యాయ దినోత్సవాలు

హైదర్ నగర్ మండల పరిషత్ పాఠశాల లో ఉపాధ్యాయ దినోత్సవాలు

ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 15: కూకట్‌పల్లి ప్రతినిధి

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ లో ఉన్న మండల పరిషత్ పాఠశాల లో ఉపాధ్యాయ దినోత్సవాలలో భాగంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి షీల్డ్ లు బహుకరించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, అక్షర జ్ఞానాన్ని అందించి, అజ్ఞానపు చీకట్లను తొలగించి,బంగారు భవిష్యత్తుకు బాటలు చూపి, తరగతి గదుల్లో దేశ భవితను తీర్చిదిద్దే మార్గదర్శకులు, మంచి చెడులను బోధించి, మానవత్వంగా ఉండాలని సూచించే గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి వారి ఘనంగా సత్కరించి, సన్మాదించడం జరిగింది అని కార్పొరేటర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహులు , ఉపాధ్యాయులు మధుసూదన్, సాబర్ ఆలీ, కుమార్, సువర్ణ, స్వప్న, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now