జర్నలిస్టులపై కేసులంటే…. పత్రికా స్వచ్చను కాలరాయడమే

జర్నలిస్టులపై కేసులంటే…. పత్రికా స్వచ్చను కాలరాయడమే

 

 

బాన్సువాడ ఆర్సి ప్రశ్నా ఆయుధం సెప్టెంబర్ 16

 

-టీఎస్ఎస్ డబ్ల్యూజేఏ రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న

 

బీర్కూర్ : తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడమంటే పత్రికా స్వేచ్ఛను కాలరాయడమేనని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాక మునుపు జర్నలిస్ట్ లకు చాలా ప్రాముఖ్యత ఉండేదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత జర్నలిస్ట్ లపై ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి జర్నలిస్ట్ లకు అన్యాయం చేస్తోందని అన్నారు. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా టీ న్యూస్ బ్యూరో సాంబశివరావుపై అక్రమ కేసులు నమోదు చేసినందుకు తమ అసోసియేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడతామని అయన హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment