భీర్కూర్ లయన్స్ క్లబ్ లో ఐ క్యాంప్
బాన్సువాడ ఆర్సి (ప్రశ్న ఆయుధం): సెప్టెంబర్ 16
భీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతీ మంగళవారం జరుగుతున్న రెగ్యులర్ ఐ క్యాంప్ ఈ వారం కూడా విజయవంతంగా కొనసాగింది. మంగళవారం నిర్వహించిన ఈ శిబిరంలో మొత్తం 28 మంది పేషెంట్లను పరిశీలించారు. వారిలో 6 మందిని ప్రత్యేక చికిత్స కోసం బోధన్ లయన్స్ హాస్పిటల్కు రిఫర్ చేశారు.
ఈ సందర్భంగా ఆప్టమలజిస్ట్ సతీష్ రోగులకు కంటి సంబంధిత పరీక్షలు నిర్వహించి, అవసరమైన సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సితలే రమేష్, జోన్ చైర్మన్ కొట్టూరి సంతోష్, డీసీ ప్రభుదాస్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి వారం కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ శిబిరం ఆశాకిరణంగా మారిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.