వరద బాధితులకు రెడ్‌క్రాస్ ఊరటనిచ్చింది

వరద బాధితులకు రెడ్‌క్రాస్ ఊరటనిచ్చింది

— గాంధారి మండలంలో 67 మందికి సహాయ కిట్ల పంపిణీ 

– కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 16

 

వరద ప్రభావితులకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఊరటనిస్తోందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం గాంధారి మండల కేంద్రంలోని రైతు వేదికలో వరద బాధితులైన 67 మందికి దుప్పట్లు, బెడ్‌షీట్లు, చీరలు, దుస్తులు, టవల్స్‌తో కూడిన సహాయ కిట్లను రెడ్‌క్రాస్ జిల్లా శాఖ సభ్యులతో కలిసి పంపిణీ చేశారు.

ప్రకృతి వైపరీత్యాలు, ఆపద సమయాల్లో రెడ్‌క్రాస్ ఎల్లప్పుడూ సహాయం అందిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇటీవల వరదలతో నష్టపోయిన బాధితులకు ఊరట కల్పించేందుకు 8 లక్షల రూపాయల విలువైన 400 కిట్లతో పాటు 100 టార్పాలిన్ కవర్లను రాష్ట్ర శాఖ వెంటనే పంపిందని తెలిపారు. ఇప్పటికే రాజంపేట, బిక్నూర్, బిబిపేట, దోమకొండ మండలాల్లో కిట్ల పంపిణీ జరిగిందని, ఈరోజు గాంధారి, ఎస్‌ఎస్‌నగర్, రామారెడ్డి, పల్వంచ మండలాల్లో పంపిణీ చేస్తున్నామని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, స్థానిక తహసీల్దార్, ఎంపీడీవో, రెడ్‌క్రాస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment