ప్రజావాణి ఫిర్యాదు పైన చర్యలు చేపట్టిన అధికారులు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 16
బిక్కనూరు పట్టణ కేంద్రంలోని ఎల్లమ్మ గుడి వద్ద కౌసల్య ఎంక్లేవ్ వెంచర్లో గ్రామపంచాయతీ కేటాయించబడిన 10% స్థలంలో వెంచర్ యజమాని గ్రామపంచాయతీ అనుమతి లేకుండా వేసినటువంటి రీకుల షెడ్డు ని అధికారులు తీసివేయించారు. పట్టణానికి చెందిన గంగల రవీందర్ ఆర్టిఐ జిల్లా ప్రతినిధి ఇట్టి వెంచర్ పైన సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం తీసుకుని ప్రజావాణిలో కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది. గంగల రవీందర్ మాట్లాడుతూ గ్రామ పంచాయితీకి కేటాయించిన స్థలంలో యజమాని రేకుల షెడ్డు వేసుకొని సొంతంగా వాడుకుంటున్నారని అట్టి స్థలాన్ని గ్రామానికి పంచాయతీ అధికారులు స్వాధీనం చేసుకోవాలని కోరారు. స్పందించిన అధికారులు త్వరితగతిన విచారణ చేసి గ్రామపంచాయతీ స్థలంలో రేకుల షెడ్డు నిర్మించారు అని నిర్ణయానికి వచ్చి చర్యలు చేపట్టారు. ఇట్టి కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, డి ఎల్ పి ఓ పాల్గొన్నారు. ఇట్టి సందర్భంగా గంగల రవీందర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి వివరాలు సేకరించామని గ్రామపంచాయతీకి రావలసిన స్థలం కోసం పోరాడమని వెంచర్ యజమాని చాలా రకాలుగా భయభ్రాంతులకు గురి చేశారని అయినా భయపడకుండా ప్రజల కోసం పోరాటం జరిగిందని తెలిపారు.