గోధుమకుంటలో హెవెన్ డౌన్ కాలనీ డ్రైనేజీ పనులు ప్రారంభం
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 16
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని గోధుమకుంట హెవెన్ డౌన్ కాలనీలో డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టారు. కాలనీ అసోసియేషన్ సభ్యుల పిలుపు మేరకు ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, గోధుమకుంట మాజీ ఎంపీటీసీ కిరణ్ జ్యోతి ప్రవీణ్, గ్రామ శాఖ అధ్యక్షులు చీర కుమార్, మాజీ వార్డ్ మెంబర్ చీర శేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
చాలా కాలంగా కాలనీవాసులను వేధిస్తున్న డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ఈ పనులు ప్రారంభం కావడం శుభపరిణామమని నాయకులు పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనలో ప్రజల భాగస్వామ్యం, ఐక్యత చాలా అవసరమని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్, జనరల్ సెక్రటరీ వీరయ్య, అసోసియేషన్ సభ్యులు, మరియు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ డ్రైనేజీ పనులతో కాలనీవాసుల కష్టాలు తీరతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.