డోంగ్లి శ్రీనివాస్ కి మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియామక పత్రం
ప్రశ్న ఆయుధం కుత్బుల్లాపూర్.సెప్టెంబర్ 16
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, మున్నూరు కాపు సంఘం ఆఫీస్ నందు మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు వనమాల ప్రవీణ్ కుమార్, మున్నూరు కాపు యువత రాష్ట్ర అధ్యక్షులు బండి సంజీవ్ ,డోంగ్లి శ్రీనివాస్ కి మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియామక పత్రం అందజేయడం జరిగింది రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ చింతపండు మహేందర్ ,రాష్ట్ర సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శి అనంత శివ, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ ఎర్రం సంజయ్, మున్నూరు కాపు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామల లవ కుమార్ ,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యాదవ క్రాంతి , మున్నూరు కాపు యువత రాష్ట్ర కార్యదర్శి ఆశన్న, తిరుపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.