అత్తమామల బాగోగులు చూడవలసిన బాధ్యత కొడుకు కోడలిది
*జమ్మికుంట సెప్టెంబర్ 16 ప్రశ్న ఆయుధం*
కన్న తల్లిదండ్రుల బాగోగులు చూడవలసిన బాధ్యత కొడుకు కోడలిది అని ఆర్డిఓ రమేష్ బాబు అన్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మాచన పెళ్లి గ్రామానికి చెందిన పర్లపెల్లి ఎల్లయ్య తన భార్య రాజమ్మ లకు ఒక్క కుమారుడు ఉండగా కుమారుడు పార్లపల్లి శంకర్ నాలుగు సంవత్సరాలు క్రితం చనిపోవడం జరిగిందని తల్లిదండ్రులు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు విషయం తెలుసుకున్న ఆర్డిఓ అధికారులను మాచనిపల్లి గ్రామానికి పంపించి సమస్యను పరిష్కరించవలసిందని రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ డివిసి కౌన్సిల్ పద్మావతి మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ ఈ శైలజ పోలీస్ కానిస్టేబుల్ ఓ రవి శ్రీనివాసులు వృద్ధ తల్లిదండ్రుల ఇంటికి పోయి సమాచారాన్ని సేకరించారు తమ కొడుకు శంకర్ భార్య సుశీల గత సంవత్సరం నుండి ఎల్లయ్య పోషణ బాగోగులు చూడటం లేదని ఆర్డిఓ కి ఫిర్యాదు చేశారు. నెలకు 5000/- రూపాయలు పోషణ నిమిత్తం ఇవ్వాలని కోడలు సుశీల కి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని అధికారులు విచారణ చేపట్టారు. తన కోడలు సుశీల ఆర్డీవో ఆదేశాలు అనుసరించడం లేనందున అధికారులు, ఆర్డీవో ఆదేశాలు అనుసరించాలి అని, తెలియజేస్తూ వృద్ధుల చట్టంపై అవగాహన కల్పించారు