వెల్ నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం…

వెల్ నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం…

నిజామాబాద్ సెప్టెంబర్ 17 : (ప్రశ్న ఆయుధం)

నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వెల్ నెస్ హాస్పిటల్ సహకారంతో బుధవారం ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం 7 గంటలనుంచి షుగర్ సంబంధిత పరీక్షలు, 8 గంటల తర్వాత ఇతర పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నిత్యం జర్నలిస్టులు పని ఒత్తిడిలో ఇతరత్ర సమస్యల వాళ్ళ షుగర్, బిపి, గుండె నొప్పులు, దీర్ఘ కాలిక రోగాల భారిన పడుతున్నారు.

దింతో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వెల్ నెస్ హాస్పిటల్ సహకారంతో వైద్య శిభిరం నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని జర్నలిస్టులు వైద్య శిబిరంలో కుటుంబ సమేతగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రోగ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ, కార్యదర్శి శేఖర్ నగర జర్నలిస్టులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment