విశ్వకర్మ మహోత్సవం శ్రామికుల గౌరవానికి ప్రతీక: ఎమ్మెల్యే మల్లారెడ్డి*

*విశ్వకర్మ మహోత్సవం శ్రామికుల గౌరవానికి ప్రతీక: ఎమ్మెల్యే మల్లారెడ్డి*

 

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 17

 

నాగారం మున్సిపాలిటీ పరిధిలోని జి.ఆర్.ఎస్.ఎస్. గార్డెన్‌లో కీసర మండల విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు రాజకీయ నాయకులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరియు నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి యజ్ఞంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు మాట్లాడుతూ, “విశ్వకర్మ కేవలం శిల్ప దేవుడు మాత్రమే కాదు, శ్రామిక లోకానికి మార్గదర్శి. విశ్వ బ్రాహ్మణ సంఘం ఐక్యతే మనకు నిజమైన బలం” అని ఉద్ఘాటించారు.

ఈ వేడుకలో మాజీ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, మండల విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఉప్పలోజు రాఘవేంద్ర చారి, ప్రధాన కార్యదర్శి సింగ్గోజు చంద్రం చారి, కోశాధికారి కనకాచారితో పాటు సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Join WhatsApp

Join Now