*విశ్వకర్మ మహోత్సవం కష్టజీవుల శక్తికి ప్రతీక: మాజీ మంత్రి మల్లారెడ్డి*
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 17
మేడ్చల్ నియోజకవర్గ ప్రజలతో ఎప్పుడూ కలిసి ఉండే మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బుధవారం రోజున నాగారం మున్సిపాలిటీలోని జీ.ఆర్.ఎస్.ఎస్. ఫంక్షన్ హాల్లో జరిగిన శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
యజ్ఞ వేదికపై ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ, “విశ్వకర్మ మహోత్సవం కేవలం ధార్మిక వేడుక కాదు. ఇది కష్టజీవుల శక్తికి, శ్రామికుల గౌరవానికి ప్రతీక. ఇలాంటి మహోత్సవాలు సమాజంలో ఐక్యత, సాంస్కృతిక విలువలను బలపరుస్తాయి” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా, ప్రజలు, పార్టీ నాయకులు ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఘన స్వాగతం పలికి, తమ సమస్యలను ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మికతతో పాటు రాజకీయ ఉత్సాహంతో కళకళలాడింది.