తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం ఘనంగా జరుపుకున్న : రాష్ట్ర జనసేన నాయకులు*

*తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం ఘనంగా జరుపుకున్న : రాష్ట్ర జనసేన నాయకులు*

 

ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 17: కూకట్‌పల్లి ప్రతినిధి

 

జనసేన పార్టీ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ వద్ద తెలంగాణ జనసేన ఇన్చార్జ్ నేమూరీ శంకర్ గౌడ్ , గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రాధారం రాజలింగం గారు, కూకట్ పల్లి ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్, వీర మహిళా నాయకురాలు కావ్య మండపాక జాతీయ జెండా ఆవిష్కరించి మిఠాయిలు పంచుకొని జన శ్రేణుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు.

 

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెలవు దినంగా ప్రకటించాలని జనసేన తరుపున ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గం ఇంచార్జ్ లు మరియు గ్రేటర్ హైదరాబాద్ జనసేన నాయకులు , వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now