టేక్రియాల లో స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
సెప్టెంబర్ 18
కామారెడ్డి జిల్లా మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు టేక్రియల్ గ్రామంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దేశంలోనే దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా ప్రజలకు మహిళలకు పిల్లలకు సాధికారత కల్పించే లక్ష్యంతోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వస్థ నారి స్వసక్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవళి మాట్లాడుతూ మహిళల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపరచడం ద్వారా కుటుంబాలను బలోపేతం చేసే దిశగా మేలు జరుగుతుంది అన్నారు. మహిళలకు గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,పోషకాహార అవసరాలను తెలిపారు. ఈ ఆరోగ్య శిబిరంలో బోధన ఆరోగ్యంపై, పోషణ పై మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు అయినా రక్త పరీక్షలు, బిపి, షుగర్ లాంటి పరీక్షలు నిర్వహించినారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన మాతృ శక్తి యోజన, అంగన్వాడి సేవల ద్వారా అందిస్తామని డాక్టర్ రవళి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవళి, ఏఎన్ఎం సుజాత, ఆశా వర్కర్లు భవ్య, శైలజ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.