డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఒకే రోజులో 33 మందికి శిక్షలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఒకే రోజులో 33 మందికి శిక్షలు

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 19

జిల్లాలో మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విచారణలో కోర్టు 33 మందికి శిక్షలు విధించింది.

పోలీసుల సమాచారం ప్రకారం, ఎల్లారెడ్డి పీఎస్ పరిధిలో 6మంది, కామారెడ్డి టౌన్ పరిధిలో 3మంది, గాంధారి పీఎస్ పరిధిలో 2మందికి ఒక్కరోజు జైలు శిక్షతో పాటు జరిమానాలు విధించగా… వీరిలో ముగ్గురికి రూ.1,000, ఎనిమిదిమందికి రూ.1,100 చొప్పున వసూలు చేశారు. అదనంగా 22మందికి రూ.1,000 చొప్పున జరిమానా విధించబడింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేశ్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ… “మద్యం సేవించి వాహనం నడపడం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొందరు ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు వికలాంగులై బాధపడుతున్నారు. ప్రజల ప్రాణాలు రక్షించుకోవడం కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కఠినంగా కొనసాగుతాయి. ఇకనైనా మద్యం సేవించి వాహనం నడపకూడదు” అని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now