కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ సందడి
— ఘనంగా నిర్వహించిన పూల పండగ వేడుకలు
— ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 22
జిల్లా కలెక్టరేట్ ఆవరణలో సోమవారం బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. పిడి మెప్మా ఆధ్వర్యంలో పట్టణ మహిళా సంఘ సభ్యులు రంగురంగుల పూలతో బతుకమ్మలు తయారుచేసి వేడుకల్లో పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, సబ్ కలెక్టర్ బాన్సువాడ కిరణ్మయి, డి ఆర్ డి ఓ, సెర్ప్ సిబ్బంది తదితరులు బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాట్లాడిన జిల్లా కలెక్టర్
బతుకమ్మ ప్రపంచంలోనే అతిపెద్ద పూల పండగ. దేశంలో మహిళలందరూ జరుపుకునే ఏకైక పండగ కూడా ఇదే. ఇట్టి వేడుకల్లో భాగమవ్వడం ఆనందంగా ఉంది” అని అన్నారు.
ఎస్ హెచ్ జి మహిళా సంఘాల సభ్యులందరికీ కలెక్టర్ అభినందనలు తెలిపారు. విశేషంగా ముస్లిం సోదరీమణులు కూడా బతుకమ్మ వేడుకల్లో భాగమవ్వడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రోజువారీగా విభాగాల వారీగా బతుకమ్మ సంబరాలు సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతాయని నోడల్ అధికారి డి ఆర్ డి ఓ వెల్లడించారు.