సీనియర్ పాత్రికేయుడిని సత్కరించిన మాజీ జడ్పిటీసి

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 23, (ప్రశ్న ఆయుధం):

జాతీయ స్థాయి జర్నలిస్టు సంఘం ఎన్‌యుజే (ఇండియా)లో జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఎల్లారెడ్డి కి చెందిన సీనియర్ పాత్రికేయుడు ఉక్కల్‌కర్ రాజేందర్ నాథ్‌కు స్థానికంగా ఘన సత్కారం లభించింది.

మాజీ జడ్పిటిసి, కాంగ్రెస్ నేత షేక్ గయాజుద్దీన్ మంగళవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా, రాజేందర్ నాథ్ గ్రామీణ స్థాయిలోనుండి జాతీయ స్థాయికి ఎదిగి, జర్నలిజం వృత్తిలో అంకితభావంతో సమాజానికి, జర్నలిస్టులకు సేవలందిస్తున్నారని ప్రశంసించారు.

తాజాగా, రాజేందర్ నాథ్ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలసి జర్నలిస్టుల సమస్యలపై చర్చించిన విషయాన్ని, అలాగే తమిళిసై గవర్నర్‌గా ఉన్నప్పుడు వినతిపత్రాలు అందించిన సందర్భాలను గుర్తుచేశారు.

షేక్ గయాజుద్దీన్ మాట్లాడుతూ, “ఎంత ఎదిగినా మర్యాదగా ఉంటూ, తన వృత్తికి న్యాయం చేస్తూ జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయడం ఆయన ప్రత్యేకత. ఇది ఆయన మంచితనానికి నిదర్శనం” అని అభినందించారు.

Join WhatsApp

Join Now